Posted in Poetry, tagged అణువణువు, ఉరి, కవిత, కవితలు, చరిత్ర, తెలుగు, తెలుగు బ్లాగులు, తెలుగు సాహిత్యం, నేను, ప్రియతమా!, ప్రేమ, మజిలీ, లేఖిని, హృదయం on ఏప్రిల్ 19, 2010|
2 వ్యాఖ్యలు »
ఒకానొక సమయాన
అవ్యక్త భావం
మనసుని పట్టి కుదిపేస్తుంది
కళ్ళల్లోంచి నీటిధారలు
ఏరులై సాగి
ఎదననంతా తడిపేస్తాయి
అశక్తంగా…
జాలిగా…
అణువణువునూ రగిలిస్తూ…
నా కళ్ళముందు
ప్రేమ మైకంలో
ఎన్నో జీవితాలు గిడసబారి పోయాయి
ప్రేమ…
ఎంత అందమైన భావన
జాతి – మతం,
ఆస్తి – అంతస్తు,
తారతమ్యాలంటూ ఎరగదు
సమభావన ప్రేమ
క్రమశిక్షణ ప్రేమ
ద్వేషం లేనిది ప్రేమ
అనురాగం, కరుణ, మృదుత్వం ప్రేమ
అలాగే…
ప్రేమ ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే
అదొక ఆట…
మనసు మనిషితో ఆడుకునే ఆట
ఆశించింది దక్కితేనే గెలుపు
గెలిచిన వారి కంటే
ఓడిన వారే ఎక్కువ
అయినా…
అందరూ ఆ ప్రేమలోనే పడుతున్నారు
కానీ…
ఎంత మందికి స్వచ్చమైన మనసుంది?
ప్రేమికులం అని చెప్పుకునే వారికి
ప్రేమంటే తెలుసా!
ఆకర్షణ, అధికారం,
స్వార్థం, సంకుచితత్వం,
లైంగిక మోహం…
ఇవీ నేటి ప్రేమకు లక్షణాలు
ప్రేమ…
ఉన్నతమైనది,
ఉన్మత్తమైనదీ,
ప్రేమించడం..
ప్రేమించబడటం..
రెండూ అర్హతలు కావు
ప్రేమలోని గొప్పదనం
ప్రేమలోని గాఢత్వం
అనుభవంలోకి రావాలంటే
ప్రేమ విఫలం కావాలి
అప్పుడే ప్రేమ విలువ తెలిసేది
నేటి ప్రేమికుల దురదృష్టం ఏమంటే
వాళ్ళ ప్రేమలు
శరీరాల కలయికతో నిలిచిపోవడం
అనంతమూ అనన్యమూ అయిన ప్రేమలోకంలో
శరీరాల కలయిక ఒక సోపానం మాత్రమే
ఈ కలయిక లేని ప్రేమ
నేడు కోటికొక్కరిలో ఉంటుందేమో!
మిగిలిన వారందరికీ…
శరీర దాహం తీర్చుకోవడమే ప్రేమ!
Read Full Post »