Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for జూన్, 2020

నీ కోసమే…

నేను నీ కోసమే మేలుకొంటాను
నేను నీ కోసమే నిద్రిస్తాను
నేను నీ కోసమే శ్వాసిస్తాను
నేను నీ కోసమే తపిస్తాను

నేను నీతో నవ్వుతాను
నేను నీతో దుఃఖిస్తాను
నేను నిన్నే ప్రేమిస్తాను
నేను నిన్నే ద్వేశిస్తాను

నా పలుకు నీ కోసం
నా పాట నీ కోసం
నా పరుగు నీ కోసం
నా బ్రతుకు నీ కోసం

నిజం
ఎందుకంటే
ఈ హృదయం
నీ చూపు సోకి
నేనుగా వెళ్ళిపోయి
నువ్వుగా మారింది

Read Full Post »