Feeds:
టపాలు
వ్యాఖ్యలు

twistedpretzela-2

అమ్మాయి:
అగ్ని అంటే భయం ఎక్కడ కాల్చేస్తుందోనని
కలలంటే భయం ఎక్కడ భగ్నమవుతాయోనని
అన్నింటికంటే ఎక్కువ భయం
నన్ను నువ్వెక్కడ మరిచి పోతావేమోనని

అబ్బాయి:
దూరంగా ఉన్నా ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటాను
స్నేహితున్నై దగ్గరకు రాకున్నా
నా స్నేహ పరిమళం నిన్ను చుట్టుముడుతూనే ఉంటుంది
ఆ భగవంతుడు
అప్పుడప్పుడు నిన్ను ఒంటరిని చేసినా
ఆ ఒంటరి తనంలో నేనొక తుంటరి కలనై
నిన్ను వెంటాడుతూనే ఉంటా
చలి రాతృల్లో నీకు కంబలి దొరక్కుండా పోతే
అగ్ని శిఖలా నిన్ను అల్లుకుని
నును వెచ్చని నిట్టూర్పునవుతా
నిన్ను మరిచి పోతాననే భయమే వద్దు
మరిచి పోవడం అనేది మనసు చేసే పని కదా!
నా దగ్గర మనసనేదే లేదు కదా!
అదెప్పుడో నీకిచ్చేసా కదా!

ఒక్క ముద్దు

 

నీ ఒక్క ముద్దు
నా కళ్ళల్లో మెరుపులు సృష్టిస్తుంది
నీ ఒక్క ముద్దు
నన్నేడిపిస్తుంది
నీ ఒక్క ముద్దు
చెరగని చిరునవ్వులు తెస్తుంది
నీ ఒక్క ముద్దు
నన్ను మృగంలా మారుస్తుంది
నీ ఒక్క ముద్దు
నా గుండెల్ని మండిస్తుంది
నీ ఒక్క ముద్దు
చీకటిలో వెలుగవుతుంది
నీ ఒక్క ముద్దు
నా శరీరం మొత్తం కంపిస్తుంది
నీ ఒక్క ముద్దు
నన్ను అగాధం లోకి తోస్తుంది
నీ ఒక్క ముద్దు
నా ఆత్మను బందిస్తుంది
నీ ఒక్క ముద్దు
సకలం మాన్పుతుంది
నీ ఒక్క ముద్దు
ఎల్లప్పుడూ స్వచ్చతనిస్తుంది
నీ ఒక్క ముద్దు
కావలసినంత శక్తినిస్తుంది
నీ ఒక్క ముద్దు
ఈ ప్రేమను నిజం చేస్తుంది.

 

 

 

 

Yours one kiss

Creates thunder in my eyes

Yours one kiss

Makes me cry

Yours one kiss

Brings the smile

Yours one kiss

Makes me brutal

Yours one kiss

Burns my heart

Yours one kiss

Makes light in the dark

Yours one kiss

My whole body vibrates

Yours one kiss

Pushes me into the abyss

Yours one kiss

Makes my soul imprisoned

Yours one kiss

Heals everything

Yours one kiss

Purifies everything

Yours one kiss

Gives enough strength

Yours one kiss

Makes true love.

వాడిన గులాబి

పుస్తకాల మధ్య ఉంచిన గులాబి వాడిపోయింది

మన బంధంలాగే

అందులోంచి వస్తున్న కమ్మని వాసన బతికే ఉంది

నీ ఙ్ఞాపకం లాగా

ఎంతగా ఆరాధించాను, ఎంతగా రోదించాను

మనం విడిపోవడం నాకు ఇష్టమే లేదు

ప్రతిక్షణం ఒంటరి తనం నన్ను వేధిస్తున్నా

ద్రోహి ఆ మరణమైనా నన్ను చేరలేదు

మెల్ల మెల్లగా ప్రయత్నించాను జీవించటానికి

నీ ఙ్ఞాపకాల కన్నీటిలో సుడి గుండంలో పడ్డ నావనయ్యాను

ప్రేమ ఎవరికీ సంపూర్ణంగా దొరకదని

ఎప్పుడూ అసంపూర్ణంగానే మిగిలి పోతుందని

మనసుకి సర్ది చెప్పాను

ఇప్పుడు నా కళ్ళల్లో ఉప్పు నీరు పొంగదు

జీవితం ఎప్పుడూ ఆగదు

ఉండుండి గుర్తొస్తాయి నీ ఙ్ఞాపకాలు

ఏడుపును మర్చి పోవడానికి భారీ మూల్యమే చెల్లించాను

శాశ్వతమైన చిరునవ్వుని నా అధరాలెప్పుడో మర్చిపోయాయి

ఎప్పుడు ఆ వాడిన గులాబీని చూసినా గుండె తరుక్కు పోతోంది

రోజుల తరబడి వేచి ఉన్న కన్నీటి ముత్యం

ఇక ఆగలేనంటూ ఎక్కడి నుండి జాలు వారిందో

నా ప్రతి కలని భగ్నం చేస్తూ బహుశా!

వేచి వేచి విసిగి వేసారిందేమో

అమెరికా చరిత్రలో కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఎందుకిలా జరిగిందో అనిపిస్తుంది…
1840లో విలియం హెన్రీ హారిసన్ ఆఫీసులో చనిపోయారు
1860 లో అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డారు
1880 లో జేమ్స్ ఎ గ్యారీ ఫీల్డ్ హత్య చేయబడ్డారు
1900 లో విలియం మేకిన్లె హత్య
1920 లో వారెన్ జి హార్డింగ్ ఆఫీసులో చనిపోయారు
1940 ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆఫీసులో చనిపోయారు
1960 జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య చేయబడ్డారు
1980 రోనాల్డ్ రీగన్ హత్యా యత్నం నుండి తప్పించుకున్నారు
అలాగే అబ్రహాం లింకన్ మరియు జాన్ ఎఫ్ కెన్నెడీ ల మధ్య కొన్ని పోలికలు
అబ్రహాం లింకన్ 1846 లో కాంగ్రెస్సు కు ఎన్నికయ్యారు
జాన్ ఎఫ్ కెన్నెడీ 1946 లో కాంగ్రెస్సు కు ఎన్నికయ్యారు
అబ్రహాం లింకన్ 1860 లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
జాన్ ఎఫ్ కెన్నెడీ1960 లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
Lincon scretary name KENNEDI
Kennedi secretary neame is LINCON
ఈ ఇద్దరు Presidents అమెరికా దక్షిణ ప్రాంతానికి చెందిన వారి చేతిలో హతమయ్యారు.
LINCON మరియు KENNEDI ల అనంతరం Ameican Presidents గా బాధ్యతలు చేపట్టిన వారి పేరు JHONSON తో అంతమవుతాయి.
In 1808 Andrew Jhonson was elected after Abraham Lincon
In 1908 Lindon Jhonson was elected after Jhon F Kennedi
లింకన్ ను హత్య చేసిన Jhon Wilks Booth 1839 లో జన్మించగా
కెన్నెడీ ని హత్య చేసిన Lee Harwe Oswald 1939 లో జన్మించాడు Abraham Lincon was assasined at FORD THEATRE and the Jhon F Kennedi assasined in his FORD CAR లింకన్ చనిపోవడానికి వారం రోజుల ముందు Maryland, Manro లో గడిపారు కెన్నెడీ చనిపోవడానికి వారం రోజుల ముందు Marylin Manro తో గడిపారు

Why I am still in love

Just I don’t know what to do
Why I am still in love with you?
I know you do not love me
And that’s the way it should be
He loves you, and you love him
Strange to think that the way we were
Used to love
Yet, somehow, it vanished into thin air

Can I get you?
If other people love
I am so sad
Just knowing we’re out of touch
It hurts to know that you do not care for me
And the way it used to be
I want you back
But he has all the qualities you love and the lack of
I hope you two are happy together
Since it can not be us ….
Together forever.

నెపోలియన్        హిట్లర్
1760              1889 పుట్టిన సంవత్సరం
1804              1933 అధికారం లోకి వచ్చిన సంవత్సరం
1809              1938 వియన్నా పట్టనాన్ని ముట్టడించిన సంవత్సరం
1812              1941 రష్యాపై దండెత్తిన సంవత్సరం
1816              1945 యుద్ధంలో ఓడిపోయిన సంవత్సరం

వీరిద్దరి మధ్య సరిగ్గా 129 సంవత్సరాల తేడా చూస్తుంటే నెపోలియన్ తిరిగి మళ్ళి పుట్టాడా!?

Image

బోసి నవ్వుల పాపాయికే తెలుసు
అమ్మ ఒడిలోని వెచ్చదనం
ఆలకించు మనసుకే తెలుసు
కోకిలమ్మ కూనిరాగాల కమ్మదనం
ఆస్వాదించే అధరానికే తెలుసు
చుంబనంలోని తీయదనం
చల్లగా వీచే గాలికే తెలుసు
పూల పరిమళంలోని ఆహ్లాదం
కోరుకున్న చెలిమికే తెలుసు
ప్రేమ బంధంలోని మాధుర్యం
అనుభవించే వయసుకే తెలుసు
జీవితంలోని ఆటుపోట్లు
ప్రేమించే నాకు మాత్రమే తెలుసు
గుండె జారి గల్లంతవ్వడం