Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఏప్రిల్ 22nd, 2009

baskp

ప్రేమా !
“ప్రేమ దొరకడం చాలా కష్టం
దొరికినా అది ఒక అగ్ని
అది ఒక తపస్సు. కానీ
దొరికిందా ప్రేమ గొప్ప వరం” అన్నారు చలం.

“ప్రేమ
ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఖాన్ని మిగిల్చేదీ ప్రేమే” అన్నారు క్రిష్ణమూర్తి

ప్రేమకి ఎవరెన్ని అర్ధాలు చెప్పినా
ఎవరెలా వివరించినా
ప్రేమ ఒక అద్భుతమైన భావన
స్పందనలో రూపం దాల్చి
అనుభూతి పొరల్లో జీవం పోసుకుని
అలౌకిక ఆత్మానందాన్నిచ్చే భావం పేరే ప్రేమ
అలాగే
విరహపు మంటల్లో రగిల్చి
ఆరని తాపం రేపేది కూడా ప్రేమే!
నేనూ ఆ ప్రేమలోనే పడ్డాను
నీ ప్రేమలో పడ్డాను ప్రాణమా!

నువు లేని నా జీవితం
తెగిన గాలి పటం
చుక్కని లేని నావ
నీ కోసం నేను పడే వేదన వర్ణనాతీతం
ఏడ్చే కంట కన్నీరు నువ్వే
నవ్వే కంట పన్నీరు నువ్వే
ఎడారి జీవితాన ఒయాసిస్సు నువ్వే
నరక కూప జన్మాన నందనవనం నువ్వే
నీ ధ్యానంలో ప్రాణం పోతుందేమో!

చిన్నప్పుడు…
బాలనాగమ్మ కథ విని
మాయల ఫకీరు ప్రాణం
చిలకలో ఉందంటే
అభూత కల్పన అనుకున్నా
నిన్ను చూసాకే కదా!
ప్రాణం ఎక్కెడైనా ఉండొచ్చనుకున్నా
భద్రమైన చోట
మనసు సాంత్వన పొందే చోట
గుండె ప్రేమలో మునిగే చోట
ఆ చోటే నీ హృదయం
నా ప్రాణం అక్కడుండడం న్యాయమే కదా!

ప్రాణం లేని దేహాన్ని ఎప్పుడైనా చూసావా?
నన్ను చూస్తే అర్ధమవుతుంది
ఒంటరిగా వెళ్ళలేక
నా ప్రాణాన్ని నీవెంట తీసుకెళ్ళావు
ఇప్పుడు
నేనొక జీవశ్చవాన్ని మాత్రమే!

Read Full Post »

నేస్తమా!
ఎందుకిలా వేధిస్తావు?
పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను
మదిలో మెదిలే అనురాగ దృశ్యాల్ని ఎవరితో పంచుకోను
గంతులేసి ఆడుకున్నప్పటి ఆనందహేళ
కనుల ముందర నిలిస్తే…
ఈ నిశీధిలో ఒంటరి పోరాటం సాగించలేను
వసంత రాత్రుల తీయదనాన్ని ఆస్వాదించనూలేను
మన్సులోనే అగ్ని పర్వతాలు బ్రద్దలై
లావా కనుల నుండి ప్రవహిస్తుంటే
మనసు విప్పి మరొకరితో మాటడనూ లేను

Read Full Post »