FROM MY HEART

పొనగంటి కవిత్వం

వలపు వల! అక్టోబర్ 7, 2009

1
నువు చూసింది ఒక క్షణమే
ఆ క్షణం నాలో కలిగిన స్పందన
ఈ జీవితానికి సరిపోయేంత
అనంతమైన ఎడబాటు తరువాత
నిన్ను చూసిన ఆనందం..
ఎలా వర్ణించను..

2
నా హృదయాన్ని గుడిగా మలచి
నీ ప్రతి రూపాన్ని దేవతగా నిలిపా
నా రక్త మాంసాలనే నైవేద్యంగా పెట్టా
కనికరమైన లేకుండా కాల రాచి పోతావేం?

3
సఖీ..
నీ తలపులు
నా గుండెను పిండినపుడు
రక్తం కన్నీరై కారుతోంది
కనీరు వరదలౌతూనే ఉంది
కాలం కరిగిపోతూనే ఉంది
చెలీ..
నీ వలపు వలలో నను బంధించి
ప్రపంచంలోని తక్కిన ఆనందాలకు..
నన్నతీతున్ని చేసావు.

 

3 Responses to “వలపు వల!”

  1. KRISHNA Says:

    avunandi manspoorthigaa preminche magavallante aadavallaku nachchadu…

    chaalaa baaga rasaru….

  2. chinni Says:

    చాల బాగుందండీ


Leave a Reply