బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ
మంచం దిగానో సోమరి ఉదయాన
అలవాటుగా అందుకున్నాను టీవి రిమోట్
కనిపించిందో వార్త శుభోదయాన అశుభమై
వెల్లువెత్తిన ఉగ్రవాదపు అనైతిక చర్య
చెలరేగిన కిరాయి మూకల పదఘట్టన
హృదయాలను కలచి వేసే దీనుల ఆక్రందన
ఏమై పోతోందీ నవ భారత భవితవ్యం
ఎటు పయనిస్తోందీ యువతరం
కన్న కలలు కల్లలయ్యాయని కలవర పడుతోంది
కనిపించిన దారెమ్మట పరుగులెడుతోంది
ఇదేనా నేటి యువకుల ఆలోచనా సరళి
యువతరానికి ఆదర్ష పురుషుడు ఫ్రాంక్ కాంపర్
వారి ఆశయాలకు గురువు ఒసామ బిన్ లాడేన్
మరిచి పోయింది నేతి యువత ఫ్రాంక్, లాడేన్ ల చరిత్ర
ఏ క్షణాన అన్నాడో శ్రీ శ్రీ
“ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం” అని
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
మానవ జీవితం సమస్తం ఊచకోతల మయం
ఆదర్శంగా నిలవాల్సిన యువతరం
అవినీతికి దగ్గరైనప్పుడు
భద్రతకే అభద్రతా భావం
ఎటు పయనిస్తోందీ నవశకం
తరాలు మారినా అంతరాలు మారని ముష్కరులు, మూఢులు
సృష్టించిన విలయ తాందవంలో
ఉద్భవించిన రక్తపుటేరుల్లో కొట్టుకు పోతోంది
ఇది చాలదా అన్నట్లు
దొడ్డి దారిన కిరాయి మూకల్ని ఉసిగొల్పి
పబ్బం గడుపుకునే కిరాతక రాజకీయం
పెంచి పోశిస్తున్న విష సర్పాలు
సరిహద్దు వివాదాల విధ్వంసాలతో
రక్తపు చారికలు అంటుకున్న కాశ్మీరీ శ్వేత వర్ణ తివాచీ
అట్లాంటిక్ పై కనిష్కను పేల్చిన ఉగ్రవాద చర్య(1985)
అస్సాం లో బోడోలు,
శ్రీలంకలో LTTE,
అఫ్ఘనీ కిరాయి ఉగ్రవాదం
లేదంటే అల్-ఉమా తీవ్రవాదం
దేశ నాయకులను మాంసపు ముద్దలుగస
నేల పాలు చేసే మానవ బాంబులు
ఇలా ఎటు చూసినా తెర్రరిజపు నీలి నీడలు
కసాయీల కసరత్తుల్లో
కరుడు కట్టిన కార్పణ్యం చూడు
తరిగి పోతున్న మానవ నైతిక విలువలు చూడు
బోస్నియా, చెచెన్యా, తజకిస్తాన్ లేకుంటే కాశ్మీర్
ఏ ప్రాంతమైన, ఏ దేశమైనా
తీవ్ర వాదపు చూపు ప్రసరించని చోటు లేదు
ఉగ్రవాద రక్కసి కబంధ
హస్తాల్లో చిక్కిన
సూడాన్, దార్-స్సలాం, నైరోబీలు
తెర్రరిజపువిధ్వంసాలకు మూగ సాక్ష్యాలు.
వ్రాసినది : సెప్టెంబర్ 1998

