నేస్తమా!
ఎందుకిలా వేధిస్తావు?
పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను
మదిలో మెదిలే అనురాగ దృశ్యాల్ని ఎవరితో పంచుకోను
గంతులేసి ఆడుకున్నప్పటి ఆనందహేళ
కనుల ముందర నిలిస్తే…
ఈ నిశీధిలో ఒంటరి పోరాటం సాగించలేను
వసంత రాత్రుల తీయదనాన్ని ఆస్వాదించనూలేను
మన్సులోనే అగ్ని పర్వతాలు బ్రద్దలై
లావా కనుల నుండి ప్రవహిస్తుంటే
మనసు విప్పి మరొకరితో మాటడనూ లేను
“పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను”చాలా బాగుందండి.
ముందుగా మీకు కృతఙ్ఞతలు. మీ బ్లాగు చూసాను. చాలా బాగుంది, మీరన్నట్లుగా కవిత్వం రాయడం రాదు అనేమాటే జీర్ణం కావట్లేదు. అన్ని భావాలను అలవోకగా రాయగల సత్తా మీలో ఉంది. KEEP IT UP