
నీ ఆలోచనలకు దూరంగా..
పారి పోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాను
జనావాసాలనొదిలి
గరిక పచ్చ మైదానాల మీదుగా అడుగులేస్తూ
నిన్ను మరచి పోవాలనుకుంటాను
నా దారికిరువైపులా ఉన్న పూలపై
నా చూపు పడినప్పుడు
నీ చిరు నవ్వు కనిపిస్తుంది
మనసు గాయపడి
విషాదం అలుముకుంటుంది
అలా కాదని…
అనంతమైన నీలాకాశాన్ని చూస్తాను
తూరుపున విచ్చుకునే తొలికిరణం
నీ చూపుల ఉప్పెనై తాకుతుంది
సూర్య కిరణాల తాకిడికో
నా మనసులోని బాధకో
నా కళ్ళు మాత్రం జలపాతాలవుతాయి
suthi
kyaa baat hai!!..
inshaallah…1
చాలా బాగుంది. అభినందనలు
కవిత వ్రాసింది మీరు..
చదివింది నేను….
నాకన్నులు కార్చినవి కన్నీరు….
.chaalaa…depth..tho.undi..mee kavitha.”..manasunna manusunna manushule…manaku devullu…” gurtochhindi..
మీ అభిప్రాయం తెలిపినందుకు కృతఙ్ఞతలు.