నేస్తమా!
నీవెవరివో నాకు తెలియదు
అపురూప లావణ్యం నీది
నీ దేహ సౌందర్యం ముందు సూర్య కాంతి సైతం
వెల వెలా పోతుంది
నీ చంద్రబింబ రూపం పై
చీకటి నీడల జాడ తెలియదు
నాకు తెలిసిందల్లా ఒక్కటే
నిన్ను చూసిన క్షణం నుండి
మల్లె మారుతాలు, పిల్ల తెమ్మరలు
వసంత రాత్రుల తీయదనాలు
ఏవీ నా దరి చేరడం లేదు