FROM MY HEART

పొనగంటి కవిత్వం

ప్రేమ మైకం ఏప్రియల్ 26, 2009

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 13:57
Tags: , , , , , , ,

 

ప్రియా!bask2
నిన్ను చూసిన తొలి క్షణమే
నీ రూపం నన్ను పిచివాణ్ణి చేసింది
ఆ క్షణమే నా జీవితం నీతో పంచుకోవాలనుకున్నాను
మరువలేని నీ వ్యక్తిత్వం
మరపు రాని నీ చిరునవ్వు
నాకు కాకుండా మరో వ్యక్తికి అంకితమైతే
నా జీవిత యానంలో చీకటి అలుముకుంటుంది
గతి తప్పుతున్న నీ నడవడిక
ఛిద్రం పడక ముందే మేలికో
ప్రేమ బంధం విలువ తెలుసుకో
ఎండమావులు నీ జీవితంలో అలుముకోక ముందే
సెలయేటిని వెతికి పట్టుకో
తియ్యదనం ఆశించే నీకు
చేదు అనుభవం ఎదురుకాకముందే
నీవు నమ్మిన వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకో
నమ్మక ద్రోహం అనే విష సర్పం
నిన్ను కాటేయక ముందే
నిజమైన ప్రేమామృతపు విలువ తెలుసుకో
నీవు ఆశించింది నీకు దక్కనప్పుడు
నిన్ను ఓదార్చేందుకు ఒక్కరూ రారు
అదే నీ జీవితం ఛితికినప్పుడు
ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారు
నలుగురిలో నవ్వులపాలు కాకముందే
నీ బ్రతుకును నందనవనం చేసుకో
అనురాగం, ఆప్యాయతల్ని
నీ కోసం పంచే అదృష్టాన్ని వెతుక్కో
అవే కరువైతే జీవితానికి చరమ గీతం తప్పదు.

 

నేనూ ప్రేమలో పడ్డాను ఏప్రియల్ 22, 2009

baskp

ప్రేమా !
“ప్రేమ దొరకడం చాలా కష్టం
దొరికినా అది ఒక అగ్ని
అది ఒక తపస్సు. కానీ
దొరికిందా ప్రేమ గొప్ప వరం” అన్నారు చలం.

“ప్రేమ
ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఖాన్ని మిగిల్చేదీ ప్రేమే” అన్నారు క్రిష్ణమూర్తి

ప్రేమకి ఎవరెన్ని అర్ధాలు చెప్పినా
ఎవరెలా వివరించినా
ప్రేమ ఒక అద్భుతమైన భావన
స్పందనలో రూపం దాల్చి
అనుభూతి పొరల్లో జీవం పోసుకుని
అలౌకిక ఆత్మానందాన్నిచ్చే భావం పేరే ప్రేమ
అలాగే
విరహపు మంటల్లో రగిల్చి
ఆరని తాపం రేపేది కూడా ప్రేమే!
నేనూ ఆ ప్రేమలోనే పడ్డాను
నీ ప్రేమలో పడ్డాను ప్రాణమా!

నువు లేని నా జీవితం
తెగిన గాలి పటం
చుక్కని లేని నావ
నీ కోసం నేను పడే వేదన వర్ణనాతీతం
ఏడ్చే కంట కన్నీరు నువ్వే
నవ్వే కంట పన్నీరు నువ్వే
ఎడారి జీవితాన ఒయాసిస్సు నువ్వే
నరక కూప జన్మాన నందనవనం నువ్వే
నీ ధ్యానంలో ప్రాణం పోతుందేమో!

చిన్నప్పుడు…
బాలనాగమ్మ కథ విని
మాయల ఫకీరు ప్రాణం
చిలకలో ఉందంటే
అభూత కల్పన అనుకున్నా
నిన్ను చూసాకే కదా!
ప్రాణం ఎక్కెడైనా ఉండొచ్చనుకున్నా
భద్రమైన చోట
మనసు సాంత్వన పొందే చోట
గుండె ప్రేమలో మునిగే చోట
ఆ చోటే నీ హృదయం
నా ప్రాణం అక్కడుండడం న్యాయమే కదా!

ప్రాణం లేని దేహాన్ని ఎప్పుడైనా చూసావా?
నన్ను చూస్తే అర్ధమవుతుంది
ఒంటరిగా వెళ్ళలేక
నా ప్రాణాన్ని నీవెంట తీసుకెళ్ళావు
ఇప్పుడు
నేనొక జీవశ్చవాన్ని మాత్రమే!

 

ఎందుకిలా వేధిస్తావు? ఏప్రియల్ 22, 2009

నేస్తమా!
ఎందుకిలా వేధిస్తావు?
పగిలిన హృదయం పలికే మూగ భాధల్ని ఎవరికి వినిపించను
మదిలో మెదిలే అనురాగ దృశ్యాల్ని ఎవరితో పంచుకోను
గంతులేసి ఆడుకున్నప్పటి ఆనందహేళ
కనుల ముందర నిలిస్తే…
ఈ నిశీధిలో ఒంటరి పోరాటం సాగించలేను
వసంత రాత్రుల తీయదనాన్ని ఆస్వాదించనూలేను
మన్సులోనే అగ్ని పర్వతాలు బ్రద్దలై
లావా కనుల నుండి ప్రవహిస్తుంటే
మనసు విప్పి మరొకరితో మాటడనూ లేను

 

కలలు కరిగి పోయిందిక్కడే ఏప్రియల్ 17, 2009

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 08:00
Tags: , , , , , ,

ఇదేమిటి?
ఎప్పుడు చూసినా
దిగాలుగా, ఏదో పోగొట్టుకున్నవాడిలా
ఇక్కడే సంచరిస్తున్నావు అందో రోజు స్వర్ణ భవనం
నన్ను నేను ఊరడించుకోవడానికన్నట్లు
“నా గుండె జారవిడుచుకుందిక్కడే!
నా మనసు ముక్కలయిందిక్కడే!
నా కలలు కరిగి పోయిందిక్కడే!” అన్నాను
స్వర్ణ భవనం తెల్లబోయింది.

 

నా కళ్ళు జలపాతాలు ఏప్రియల్ 17, 2009

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 07:17
Tags: , , , , , ,

tears

నీ ఆలోచనలకు దూరంగా..
పారి పోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాను
జనావాసాలనొదిలి
గరిక పచ్చ మైదానాల మీదుగా అడుగులేస్తూ
నిన్ను మరచి పోవాలనుకుంటాను
నా దారికిరువైపులా ఉన్న పూలపై
నా చూపు పడినప్పుడు
నీ చిరు నవ్వు కనిపిస్తుంది
మనసు గాయపడి
విషాదం అలుముకుంటుంది
అలా కాదని…
అనంతమైన నీలాకాశాన్ని చూస్తాను
తూరుపున విచ్చుకునే తొలికిరణం
నీ చూపుల ఉప్పెనై తాకుతుంది
సూర్య కిరణాల తాకిడికో
నా మనసులోని బాధకో
నా కళ్ళు మాత్రం జలపాతాలవుతాయి

 

కరిగే హృదయం ఏప్రియల్ 10, 2009

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 15:49
Tags: , , , ,

bask

అరిగేలా నడిచే కాళ్ళకు
కరిగేలా చూసే కళ్ళకు
తహ తహలాడే తనువుకు తప్ప
నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం
హారతి కర్పూరంలా
కరిగి పోతొందని.

 

ఎవరు! ఏప్రియల్ 4, 2009

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 12:52
Tags: , , , ,

నేస్తమా!
నీవెవరివో నాకు తెలియదు
అపురూప లావణ్యం నీది
నీ దేహ సౌందర్యం ముందు సూర్య కాంతి సైతం
వెల వెలా పోతుంది
నీ చంద్రబింబ రూపం పై
చీకటి నీడల జాడ తెలియదు
నాకు తెలిసిందల్లా ఒక్కటే
నిన్ను చూసిన క్షణం నుండి
మల్లె మారుతాలు, పిల్ల తెమ్మరలు
వసంత రాత్రుల తీయదనాలు
ఏవీ నా దరి చేరడం లేదు