ఒకె ఒక్క విషయం…
మానవ జాతి యావత్తునూ పట్టి పీడిస్తున్నవిషయం…
సమస్త లోకాన్ని నిర్వీర్యం చేసే విషయం…
మేధావులూ, శాస్త్రవెత్తలూ కలవర పడుతున్న విషయం…
క్షణ క్షణం మనుషుల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి…
యాంత్రిక జీవనం సాగించే మనలో అకారణ ద్వేషం, అణువణువునూ కదిలించే విషాద సంగటనలు. మమత, మానవత్వం, పేగు బంధం అన్నీ సమసి పోతున్నయి.ఈ నవీన సమాజంలో బ్రతుకు దుర్భరమై ఫొతోంది. మనషుల్లో అశాంతి… ఎందుకిదంతా?
నక్క – ద్రాక్ష పళ్ళ కథ… అందని ద్రాక్ష పళ్ళు పుల్లన సామెత, ఇది కథల్లో చదువుకున్నాము. అది సంతృప్తి చెందిన నక్క కథ. కాని మనుషుల్లో రెండు రకాల భావాలున్నాయే! ఒకటి సంతృప్తి… రెండు అసంతృప్తి… సంతృప్తి చెందిన వాడు సర్దుకు సర్దుకుపోతున్నాడు. అసంతృప్తి చెందిన తిరగబడుతున్నాడు. ఆ తిరుగుబాటులో ఆనందం పొందుతున్నాడు, మనిషి రాక్షసుడిగా మారుతున్నాడు, పైశాచిక ఆనందం పొందుతున్నాడు. మానవత్వం నశించి దానవత్వం పెరుగుతోంది.నేటి సమాజంలో మనుషులు వారి ప్రవర్తన చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. మానవ సంబంధాలన్ని మంట కలిసి పోతున్నాయి. ఎక్కడ చూసినా అఘాయిత్యాలే. అడుగడుగునా స్త్రీ జాతిపై పురుష పంజా దెబ్బలే. కట్నం చాల లేదని కాల్చి వేతలు, అభం శుభం తెలీయని చిన్నారులపై అఘాయిత్యాలు. వావి వరుసలు మరచిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నరు. ఆలికీ, చెల్లికీ, తల్లికీ అర్ధాన్నే మారుస్తున్నారు. కన్న కూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి, స్వంత పిన్ని కూతురు, చెల్లెలు అని కూడా చూడకుండా ప్రేమించమని, కాదన్నందుకు ఆ అమ్మాయినే చంపబోయిన అన్న, ప్రేమించటం లేదన్న మాట చెప్పినందుకు హత్యకు గురైన ప్రసన్న లక్ష్మి, శ్రీ లక్ష్మి, భార్గవి ఇలా ఎందరో, మొన్నటికి మొన్న విజయవాడలో మీనా కుమారి, నిన్నటికి నిన్న బ్రిటన్లో జ్యోతిర్మయి లాంటి వారు బలి అవుతూనే వున్నారు.
శ్రీ శ్రీ మహాప్రస్తానంలొ “మనదీ ఒక బ్రతుకేనా, కుక్కలవలె, నక్కలవలె, సందులలో పందులవలె” అని అన్నరు. నిజమే ఈ జనారణ్యంలో మనం అంతకంటె హీనంగానే బ్రతుకుతున్నాము. ఏదైనా అన్యాయం కళ్ళ ముందే జరుగుతుంటే ఇదేమిటని ప్రశ్నించం. ఎందుకంటె భయం. పోలీసు కేసైతే ఎంక్వైరీలు, కోర్తుల చుట్టూ తిరగాలనే ఆలోచనే మనల్ని నోరు విప్పనీయదు.చట్టం, న్యాయం ఈ రెండింటికి ఇప్పుడున్న అర్ధం వేరు, చట్టం.. ధనం, పలుకుబడి ఉన్నవాడికి చుట్టం. వాళ్ళు చేసే అక్రమాలనే న్యాయం అంటుందీ చుట్టం. చట్టమెప్పుడూ బంధు ప్రీతి చూడదని, తన పని తాను చేసుకు పోతుందని ఎపూదూ వినేమాట, కానిది వాస్తవదూరం. మొన్నామధ్య జరిగిన ఒక సంఘటనను పరిశీలిస్తే డబ్బుంటే చాలు ఎలాంటి నేరం చేసైనా అరెస్టు కాకుండా తప్పించుకోవచ్చని అర్ధమవుతుంది. ఆనాటి సంఘటనలో గాయపడి ప్రాణాపాయ స్తితిలోంచి బయటపడిన ఇద్దరు బాధితులకన్నా, సదరు బాధితులను ఆ స్తితికి గురి చేసిన వ్యక్తే ఎక్కువ కాలం హాస్పిటల్లో చికిత్స పేరుతో చట్టం నుండి తప్పించుకున్న వైనం తెలియంది కాదు.
ఛట్టం గురించి ఇంకా చెప్పాలంటే విజయవాడలో జరిగిన ఆయెషా మీరా హత్య చెయబడి నెలలు గడుస్తున్నా ఆ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం అనేక అనుమానాలను రేకిత్తిస్తోంది.